Sunday, January 19, 2025

దంపతుల మధ్య చిచ్చుపెట్టిన జ్యోతిష్యం, వివాహిత ఆత్మహత్య-hyderabad crime news in telugu amberpet woman commits suicide husband slapped in horoscope issue ,తెలంగాణ న్యూస్

మొయినాబాద్ లో పట్టపగలే యువతి దారుణ హత్య

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో పట్టపగలే దుండగులు ఓ యువతని హతమార్చి మృతి దేహాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగలబెట్టారు. స్థానికులు, రైతులు రోడ్డు పక్కన కాలుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతుల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా అప్పటికే 80% శరీరం కాలిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, యువతిని వేరే చోట హత్య చేసి అక్కడ తగలబెట్టినట్లుగా గుర్తించారు. ఆమె వయస్సు 20 నుంచి 25 మధ్య ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. యువతికి ఇంకా పెళ్లి కాలేదని పోలీసులు నిర్ధారించారు. దుండగులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో లభించిన సగం కాలిపోయిన ఫోన్ దొరకడంతో ఆ సెల్ ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. మరో పక్క మృతురాలిపై ఎక్కడైనా మిస్సింగ్ కేసు నమోదు అయిందా? అనేదానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana