ఎంపిక విధానం
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేస్తారు. మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతిలో వచ్చిన మార్కులు (కనీసం 50% మొత్తం మార్కులతో) లతో పాటు, అప్రెంటిస్షిప్ చేయాల్సిన ట్రేడ్ లో చేసిన ఐటీఐ మార్కుల శాతం ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తారు. డివిజన్/యూనిట్ వారీగా, ట్రేడ్ వారీగా, కమ్యూనిటీ వారీగా, పైన పేర్కొన్న విధంగా అభ్యర్థి పొందిన మార్కుల శాతం ఆధారంగా తుది మెరిట్ జాబితాను రూపొందిస్తారు.