Falimy Movie Review
సినిమా రివ్యూ: ఫలిమీ
రేటింగ్: 2.5/5
నటీనటులు: బసిల్ జోసెఫ్, జగదీశ్, మంజూ పిళ్ళై, సందీప్ ప్రదీప్, మీనరాజ్, రైనా రాధాకృష్ణ తదితరులు
ఛాయాగ్రహణం: బబ్లు అజు
సంగీతం: విష్ణు విజయ్
నిర్మాతలు: లక్ష్మి వారియర్, గణేష్ మీనన్, అమల్ పాల్సన్
రచన, దర్శకత్వం: నితీష్ సహదేవ్
విడుదల తేదీ: డిసెంబర్ 18, 2023
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌
Malayalam movie Falimy review in Telugu: మలయాళంలో ఫస్ట్ సూపర్ హీరో మూవీ ‘మిన్నల్ మురళి’తో దర్శకుడు బసిల్ జోసెఫ్ ఇతర భాషల ప్రేక్షకుల్నీ ఆకట్టుకున్నారు. ఆయనలో హీరో కూడా ఉన్నారు. ‘జయ జయ జయహే’ సినిమాలో హీరో ఆయనే. బసిల్ జోసెఫ్ నటించిన లేటెస్ట్ మలయాళ సినిమా ‘ఫలిమీ’. ఈ ఏడాది నవంబర్ 17న కేరళలో థియేటర్లలో విడుదలైంది. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో అనువదించి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో విడుదల చేశారు.
కథ: అనూప్ డబ్బింగ్ ఆర్టిస్ట్. హిందీ సీరియల్ ‘హే సులోచనా’లో హీరోకి లోకల్ లాంగ్వేజ్‌లో డబ్బింగ్ చెబుతాడు. తండ్రి (జగదీశ్) ఖాళీగా ఇంట్లో కూర్చుంటాడు. ఒకప్పుడు ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. లాభసాటిగా లేకపోవడంతో మూసేశారు. తల్లి (మంజూ పిళ్ళై) వేరే ప్రెస్‌లో ఉద్యోగానికి వెళుతుంది. విదేశాలు వెళ్లాలని కలలు కనే తమ్ముడు (సందీప్ ప్రదీప్)… కాశీకి వెళ్లాలని ప్రయత్నించే తాతయ్య (మీనరాజ్)… పెళ్లి కోసం 15 సంబంధాలు చూసిన అనూప్… ఒకరితో మరొకరికి సత్సంబంధాలు లేని ఫ్యామిలీ. ఇదీ వాళ్ళ హిస్టరీ!
అనూప్ మూడు నెలల క్రితం చూసిన అమ్మాయి అనఘా (రైనా రాధాకృష్ణ) ‘యస్’ చెప్పడంతో… పెళ్లికి సిద్ధమవుతారు. నిశ్చితార్థం రోజున అనఘా వెనుక తాను ఐదు నెలలు తిరిగానని గొడవ చేయడంతో మండపం నుంచి అనూప్ కోపంగా ఇంటికి వెళతాడు. పెళ్లి ఆగుతుంది. ఆ తర్వాత ఫ్యామిలీ అందరూ కలిసి కాశీ వెళతారు. కాశీ ప్రయాణంలో అనూప్ ఫ్యామిలీకి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయాయి? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ: కాలేజ్ ఫ్రెండ్స్ లేదా కజిన్స్ విహారయాత్రకు వెళ్లిన నేపథ్యంలో రోడ్ జర్నీ మూవీస్ ఎక్కువగా వచ్చాయి. అయితే… మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేపథ్యంలో తీసిన రోడ్ జర్నీ మూవీ కావడం ‘ఫమిలీ’ స్పెషాలిటీ. మిడిల్ క్లాస్ కష్టాలు, ఆ పరిస్థితులు నవ్వులు పూయిస్తాయి.
ఫ్యామిలీ (Family) అని కాకుండా ఇంగ్లీష్ లెటర్స్ జంబ్లింగ్ చేసి ‘ఫమిలీ’ (Falimy) అని టైటిల్ పెట్టడంలో దర్శకుడు నితీష్ సహదేవ్ కాస్త ప్రత్యేకత చూపించారు. ఆ ప్రత్యేకత సినిమా అంతటా కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ‘ఫమిలీ’ ప్రారంభంలో పాత్రల పరిచయానికి దర్శకుడు కాసేపు సమయం తీసుకున్నాడు. హీరో పెళ్లి చూపుల నుంచి కామెడీ కాస్త ఫ్రంట్ సీటు తీసుకుంది. నిశ్చితార్థంలో గొడవ తర్వాత హీరో ఇంట్లో సన్నివేశం నవ్విస్తుంది. కాశీ ప్రయాణం కూడా తొలుత నవ్వులు పూయిస్తుంది. అయితే… ప్రయాణం ముందుకు సాగుతున్న కొలదీ భారం పెరుగుతూ ఉంటుంది. హీరో హీరోయిన్ల మధ్య ఎపిసోడ్ సింపుల్‌గా ముగించారు.
’ఫమిలీ’ కథ, కథనాలు, సన్నివేశాలు సహజంగా ఉంటాయి. సిట్యువేషనల్ కామెడీ నవ్విస్తుంది. అయితే… కథలో అసలు విషయాన్ని పైపైన తేల్చేశారు. సినిమాలో మంచి ఎమోషన్ ఉంది. తండ్రి కొడుకులు ఎందుకు మాట్లాడుకోరు? కాశీలో ఆ ఇద్దరు మాట్లాడుకోవాల్సిన వచ్చినప్పుడు ఏం జరిగింది? వంటి అంశాలను సరిగా ఆవిష్కరించలేదు. తాతయ్య, పక్కింటి తాతయ్య మధ్య సన్నివేశాలు బాగా తీశారు. పాటలు కథలో భాగంగా వచ్చాయి. డబ్బింగ్ సాంగ్స్ కనుక గుర్తు ఉండవు. నేపథ్య సంగీతం ఓకే. కెమెరా వర్క్, ప్రొడక్షన్ వేల్యూస్ పర్వాలేదు.
నటీనటులు ఎలా చేశారంటే: మిడిల్ క్లాస్ యువకుడి పాత్రలకు బసిల్ జోసెఫ్ కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. చదువు సంధ్యలు వంటబట్టని, మంచి ఉద్యోగం లేని, పెళ్లి కాని యువకుడిగా ఆ ఫ్రస్ట్రేషన్, నిస్సహాయత చక్కగా చూపించారు. న్యాచురల్ యాక్టింగ్ చేశారు.
హీరో తమ్ముడిగా సందీప్ ప్రదీప్ మంచి నటన కనబరిచారు. ఆయన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్స్, కోపం ప్రదర్శించే సన్నివేశాల్లో అతని పాత్రతో యూత్ కనెక్ట్ అవుతారు. తాతయ్యగా నటించిన మీనరాజ్ చక్కగా నటించారు. జగదీశ్, మంజూ పిళ్ళై తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
చివరగా చెప్పేది ఏంటంటే: కామెడీ సీన్లు బావున్నాయి. కానీ, కాశీ యాత్రను చాలా సాగదీశారు. సినిమాలో మంచి కంటెంట్ ఉంది గానీ ఎంగేజింగ్ & ఎంటర్‌టైనింగ్‌గా చెప్పడంలో దర్శకుడి తడబాటు కనిపించింది. దాంతో ఏవరేజ్ కామెడీ మూవీగా మిగిలింది. అయితే… బసిల్ జోసెఫ్ న్యాచురల్ యాక్టింగ్ & కామెడీ, ఆయన పాత్రకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.