Saturday, January 31, 2026
Home NEWS కారు దిగి హస్తం పట్టిన సందీప్ రెడ్డి…!

కారు దిగి హస్తం పట్టిన సందీప్ రెడ్డి…!

0
287
  • కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్వీ అధ్యక్షుడు సందీప్ రెడ్డి
  • కారు దిగి.. హస్తానికి ‘హాయ్’ చెప్పిన సందీప్ రెడ్డి!
  • కాంగ్రెస్ కండువా కప్పుకున్న యువ నేత

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు బిఆర్ఎస్ పార్టీలో మరో వికెట్ పడింది. నియోజకవర్గ బిఆర్ఎస్వీ అధ్యక్షులుగా కొనసాగుతున్న యువ నాయకుడు సందీప్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం కారు దిగి.. హస్తం గూటికి చేరారు. గత కొద్దిరోజులుగా పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి తెర దించుతూ, ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో సందీప్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బిఆర్ఎస్ పార్టీకి అధికారికంగా రాజీనామా లేఖను పంపిన వెంటనే, ఎమ్మెల్యే దగ్గరకు చేరుకొని కాంగ్రెస్ శ్రేణులతో కలిశారు.యువతరం కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతుండటం నియోజకవర్గంలో పార్టీ బలానికి నిదర్శనమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సందీప్ రెడ్డి వంటి యువ నాయకుల రాకతో నియోజకవర్గంలో కాంగ్రెస్ మరింత పుంజుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సందీప్ రెడ్డి మనస్తపం చెందిన పార్టీ ని విడినట్టు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here