- వార్డు నెంబర్ 1 అభివృద్ధియే లక్ష్యం
- జనసేన అభ్యర్థి అగ్గనూర్ అనిత
- మాల్రెడ్డిపల్లిని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతాం
- సిరి యాదవ్ కుటుంబ సభ్యురాలిగా బరిలోకి.. ఘనంగా నామినేషన్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో జనసేన పార్టీ వేగం పెంచింది. మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డ్ (మాల్రెడ్డిపల్లి) నుండి జనసేన అభ్యర్థిగా అగ్గనూర్ అనిత శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేశారు. సిరి యాదవ్ కుటుంబ సభ్యురాలైన అనిత, భారీ ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా అగ్గనూర్ అనిత మాట్లాడుతూ.. వార్డ్ నెంబర్ 1 అభివృద్ధిపై తమకు స్పష్టమైన ప్రణాళిక ఉందని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మాల్రెడ్డిపల్లిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, తాండూరు మున్సిపాలిటీలోనే ఈ వార్డును ఒక ఆదర్శవంతమైన వార్డుగా మారుస్తామని ఆమె హామీ ఇచ్చారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా, అవినీతి రహిత పాలనను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సాధకబాధకాలు తెలుసుకుంటామని, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.సిరి యాదవ్ కుటుంబానికి ఉన్న సేవా దృక్పథాన్ని గుర్తించి, గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మాల్రెడ్డిపల్లి వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆమెకు సంఘీభావం ప్రకటించారు.






