Prema Entha Madhuram Today Episode: అక్కి, అభయ్ ఇద్దరు స్కూల్ నుంచి వస్తున్న సమయంలో జోగమ్మ కనిపిస్తుంది. ఆమె ఎవరికో జోష్యం చూసి చెప్తూ ఉంటుంది. అక్కడ ఉన్నవాళ్లు జోగమ్మను చూసి బాగా చెప్తుంది అనుకోవటం పిల్లలు వింటారు.
అక్కి: ఆవిడ ఏ సమస్యకైనా పరిష్కారం చూపిస్తారట.. మనం కూడా నాన్న గురించి అడుగుదామా అని అంటుంది.
అభయ్ సరే అనడంతో ఇద్దరూ జోగమ్మ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ సమస్య చెప్పబోతారు.
జోగమ్మ: మీ తండ్రి కోసమే కదా మీ తపన అంటుంది.
ఆశ్చర్యపోయిన పిల్లలు మీకు ఎలా తెలుసు అని అడుగుతారు.
జోగమ్మ: అమ్మకి అన్నీ తెలుసు.
పిల్లలు: అయితే మా నాన్న కనిపిస్తారా
జోగమ్మ: కళ్ళ ముందు ఉన్న బంధాన్ని కనిపెట్టలేకపోతున్నారు.. మీ రక్త సంబంధమే మీ బంధాన్ని కలుపుతుంది అంతా శుభమే జరుగుతుంది అని చెప్పడంతో నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు పిల్లలు.
అప్పుడే మాల వేసుకుని ఉన్న సుబ్బు అటుగా వస్తూ కళ్ళు తిరిగి పడిపోతాడు.. అది చూసిన పిల్లలు అతనికి సపర్యలు చేస్తారు. ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు.
సుబ్బు: అయ్యప్ప మాలలో ఉన్నాను కదా ఉపవాసం ఉన్నాను.. అందుకే కాస్త నీరసం వచ్చింది ఇప్పుడు బాగానే ఉంది.
పిల్లలు సుబ్బుని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్తారు. అప్పటికే పద్దు సుబ్బు ఇంకా రాలేదని కంగారు పడుతూ ఉంటుంది. పిల్లలతో సహా వచ్చిన సుబ్బుని చూసి ఎందుకు ఇంత లేట్ అయింది పిల్లలు ఎవరు అని అడుగుతుంది.
పిల్లలు: వచ్చే దారిలో తాతయ్య కళ్ళు తిరిగి పడిపోయారు అని చెప్తారు.
పద్దు: అయ్యో ఇప్పుడు ఎలా ఉంది? అందుకే ఒక్కడివే బయటికి వెళ్లొద్దని చెప్తాను అంటూ కోప్పడుతుంది.
అక్కి: ఆయనని అలా తిడుతూనే ఉంటారా అంటుంది.
నవ్వుకుంటారు సుబ్బు దంపతులు. పిల్లలకి థాంక్స్ చెప్తుంది పద్దు.
పిల్లలు: ఇందులో థాంక్స్ చెప్పడానికి ఏముంది ఎదుటివాళ్ళకి సాయం చేయటం చాలా మంచి విషయం అని చెప్పింది మా అమ్మ.
పద్దు అయితే మీ అమ్మ కూడా చాలా మంచిది అని చెప్పి పిల్లల్ని కూర్చొమని సున్నుండలు తీసుకువచ్చి ఇస్తుంది.
అక్కి: నాకు సున్నుండలు అంటే చాలా ఇష్టం.. ఇంకొకటి ఇవ్వండి అనటంతో సుబ్బు దంపతులు ఇద్దరు ఎమోషనల్ అవుతారు.
అక్కి: ఏమైంది అంటుంది.
సుబ్బు: ఏమీ లేదమ్మా.. మా అమ్మాయికి కూడా సున్నుండలు అంటే చాలా ఇష్టం నిన్ను చూస్తుంటే అచ్చు మా అమ్మాయిలాగే కనిపిస్తున్నావు అంటుంది.
ఏం కాదు నేను మా అమ్మ పోలిక అంటుంది అక్కి.
పద్దు : అయితే మా అమ్మాయి కూడా మీ అమ్మ లెక్క ఉంటుందేమో.
అక్కి: మీ అమ్మాయి ఫోటో చూపించండి ఎలా ఉంటుందో చెప్తాను అనటంతో గోడకి ఉన్న అను ఫోటో చూపిస్తుంది పద్దు.
ఆ ఫోటోలు చూసిన పిల్లలిద్దరూ షాక్ అవుతారు. తను మా అమ్మే అని చెప్పబోతుంది అక్కి.
అభయ్: మనం అమ్మ గురించి ఎవరికీ చెప్పమని మాటిచ్చాము చెప్పొద్దు అనటంతో ఊరుకుంటుంది.
అక్కి : అయితే వీళ్ళు మనకి అమ్మమ్మ తాతయ్య అవుతారు వీళ్ళ దగ్గర మన నాన్న ఫోటో కూడా ఉండి ఉంటుంది అని అభయ్ తో అంటూ మీ అమ్మాయి ఫోటోలు ఇంకా ఉన్నాయా అని అడుగుతుంది.
పద్దు: బోలెడన్ని ఉన్నాయి అని చెప్పి లోపలికి వెళ్లి ఆల్బమ్ తీసుకొని వచ్చి పిల్లలకు ఇస్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.