- కాంగ్రెస్‌లో చేరిన అమ్జద్ ఖాన్
- బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరికలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణ రాజకీయాల్లో మార్పులు మొదలయ్యాయి. మున్సిపల్ పరిధిలోని 3వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నేత అమ్జద్ ఖాన్ తన అనుచరులతో కలిసి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, అమ్జద్ ఖాన్‌కు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. వార్డు అభివృద్ధిలో అమ్జద్ ఖాన్ చురుకైన పాత్ర పోషిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం అమ్జద్ ఖాన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో తాండూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, అందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.






