CM జగన్ పై సొంత పార్టీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఫైర్ అయ్యారు. శింగనమల నియోజకవర్గ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపించారు. కనీసం నియోజకవర్గానికి నీళ్లు కూడా తీసుకురాలేకపోతున్నానని బాధతో వీడియో విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయింపుపైనా పద్మావతి మాట్లాడారు. ఎస్సీ నియోజకవర్గమంటే అంత చిన్న చూపా ? ఒక కులం, ఒక నియోజకవర్గానికే అన్నీ సమకూరుస్తారా ? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.