ఇక ఎక్కువ మంది చేసే సాధారణ తప్పు ఒకటి ఉంది. ఇది కచ్చితంగా రిపీట్ చేస్తుంటారు. చాలా సార్లు మనం వర్క్ అవుట్ చేసి, అవసరానికి మించి తింటాం. వర్కవుట్ చేయడం వల్ల కేలరీలు కరిగిపోయాయని భావిస్తాం. దీంతో కొంచెం ఎక్కువ తింటాం. దీని వల్ల ప్రయోజనం ఉండదు. ఇలా నిరంతరం చేస్తే మీ బరువు పెరుగుతుంది. మనం బర్న్ చేసే దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకోవడం ప్రారంభించడం మంచిది కాదు. అందువల్ల అనారోగ్యకరమైన స్నాక్స్‌కు బదులుగా పండ్లు, కూరగాయలను తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. మెరుగైన ఫలితాలు కావాలంటే ప్రీ-వర్కౌట్, పోస్ట్-వర్కౌట్, రోజూ వారీ భోజనం గురించి డైటీషియన్‌ను సంప్రదించాలి.