దళిత బంధు ప్రభావం
వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్ లోక్ సభ సీటును బీఆర్‌ఎస్ గెలుస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. 2009లో 10 అసెంబ్లీ సీట్లే టీఆర్ఎస్, కేసీఆర్ దీక్షతో ఆరు నెలల్లోనే పరిస్థితి మారిందన్నారు. 1985-89 మధ్య ఎన్టీఆర్ ఎన్నో మంచి పథకాలు తెచ్చినా, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారని గుర్తుచేశారు. “బంధు” పథకాల అమలు ప్రభావం బీఆర్‌ఎస్‌పై పడిందన్నారు. తెలంగాణ కోసం కడుపు చించుకుని కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనన్నారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ పాలన తేలిపోయిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే నిరసన సెగలు మొదలయ్యాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు.