ఒక గిన్నెలో కొబ్బరి నీళ్లు పోయండి. తర్వాత కొబ్బరికాయను మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోవాలి. దీన్ని ఆ నీటిలో వేసి బాగా కలపాలి. దీనికి పాలు, కొబ్బరి పాలు జోడించండి. మీకు కావాలంటే వేయించిన జీడిపప్పు వేయవచ్చు. కిస్ మిస్ కూడా జోడించొచ్చు. కావాలంటే కాస్త చక్కెర వేసుకోండి. తర్వాత ఫ్రిజ్‌లో ఉంచాలి. అంతే రుచికరమైన లేత కొబ్బరి పాయసం రెడీ.