- 17వ వార్డు బరిలో శ్వేత జయప్రకాష్
- కాంగ్రెస్ టికెట్ తనకేనని ధీమా
- వార్డు అభివృద్ధియే లక్ష్యమని వెల్లడి
జనవాహిని ప్రతినిధి వికారాబాద్ జిల్లా : పరిగి మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల సందడి మొదలైంది. రిజర్వేషన్ల ఖరారుతో స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మున్సిపాలిటీలోని 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాలేపల్లి శ్వేత జయప్రకాష్ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. తాజా రిజర్వేషన్లలో ఈ వార్డు ‘జనరల్ మహిళ’కు కేటాయించడంతో ఆమె తన ప్రచార వ్యూహాలకు పదును పెంచారు.ఈ సందర్భంగా శ్వేత జయప్రకాష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనపై నమ్మకం ఉంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తే, ప్రత్యర్థులపై భారీ మెజారిటీతో విజయం సాధించి తీరుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా వార్డులోని ప్రతి గల్లీని పర్యవేక్షిస్తూ, స్థానిక ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకున్నానని ఆమె తెలిపారు.వార్డు అభివృద్ధిపై ఆమె తన ప్రణాళికను వివరిస్తూ…వార్డులో నెలకొన్న డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఏ అవసరం వచ్చినా వార్డు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని స్పష్టం చేశారు.17వ వార్డును మున్సిపాలిటీలోనే ఒక ఆదర్శవంతమైన వార్డుగా మార్చడమే తన ప్రధాన ఆశయమని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని, ఈ ఎన్నికల్లో వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని ఆమె కోరారు.






