- రాజీవ్ కాలనీ మార్పు కోసం యువనేత నవీన్ కుమార్ ముందడుగు
- తాండూరు 8వ వార్డు బీజేపీ అభ్యర్థిగా పోటీ
- యువత, వార్డు సభ్యుల కోరిక మేరకే బరిలోకి..
- భారీ మెజారిటీతో గెలుస్తాననే ధీమా
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు (రాజీవ్ కాలనీ) రాజకీయాల్లో నవశకం ఆరంభం కానుంది. రాజీవ్ కాలనీ రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా, మార్పు కోసం యువకుడు నవీన్ కుమార్ నడుం బిగించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆయన 8వ వార్డు నుండి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.నవీన్ కుమార్‌కు వార్డులోని యువతలో మంచి పేరు ఉండటంతో పాటు, సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. వార్డు సభ్యులు, కాలనీ వాసులు మరియు యువత పెద్ద ఎత్తున, అందరి అభీష్టం మేరకు ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ.. గత కొంతకాలంగా రాజీవ్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. యువత తలచుకుంటే ఏదైనా సాధ్యమని, బీజేపీ నాయకత్వంలో వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజల మద్దతుతో ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నవీన్ కుమార్ రాకతో 8వ వార్డులో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.






