- బీఆర్ఎస్‌లో చేరిన మాజీ కౌన్సిలర్ ‘బాంబినో’
- పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్న నాయకురాలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణం లో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడగా, తాజాగా మరో నాయకురాలు పార్టీని వీడింది. పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకురాలు, తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బాంబినో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. మంగళవారం ఆమె అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బాంబినోకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, పార్టీ పట్ల ఉన్న నమ్మకంతోనే ఇతర పార్టీల నేతలు గులాబీ గూటికి చేరుతున్నారని అన్నారు. బాంబినో వంటి అనుభవం ఉన్న నాయకులు చేరడం వల్ల పట్టణంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం బాంబినో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం మరియు పైలెట్ రోహిత్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడనై బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు.






