- తాండూరు మున్సిపాలిటీ 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్ళీ వెంకట్ రాములు?
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 6వ వాటిలో పోటీ చేసేందుకు వెంకట్ రాములు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి తనదైన ముద్ర వేశారు.వార్డు ప్రజలతో ఉన్న సాన్నిహిత్యం, నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుండటంతో, ఈసారి కూడా పార్టీ ఆయనకే అవకాశం ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం ఆశీస్సులతో ఈసారి భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని వెంకట్ రాములు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వార్డు అభివృద్ధిే ధ్యేయంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఈసారి పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండేందుకు సిద్ధంగా ఉన్నాను అని ప్రకటన చేశారు.






