Friday, January 10, 2025

భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం | narendra modi oath as prime miniset| prime minister modi oath| modi oath

posted on Jun 9, 2024 7:45PM

భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. మోడీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

ఈసారి ఐదుగురు తెలుగు రాష్ట్రాల ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి దాదాపు 8 వేల మంది దేశ, విదేశ ప్రముఖులతోపాటు సార్క్ సభ్య దేశాల నేతలు హాజరయ్యారు.

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జేడీయూ అధినేత నితీష్ కుమార్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ, సినీ నటుడు షారుక్ ఖాన్, రజనీకాంత్‌తోపాటు ఆధ్యాత్మికవేత్త చిన్నజీయర్ స్వామి, పలు పీఠాధిపతులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana