Wednesday, December 25, 2024

అత్తాపూర్ లో దారుణం, బీరు సీసాతో గొంతు కోసి లారీ డ్రైవర్ హత్య!-hyderabad attapur crime friends killed lorry driver after liquor party ,తెలంగాణ న్యూస్

Hyderabad Crime : హైదరాబాద్ లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో లారీ డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తిని తోటి స్నేహితులే దారుణంగా హత్య చేసి చంపేశారు. అత్తాపూర్ లోని సులేమాన్ నగర్ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ లాయీఫ్(30), అతని ముగ్గురు స్నేహితులు అత్తాపూర్ పీవీఎన్ఆర్ పిల్లర్ నంబర్ 258 వద్దకు శనివారం రాత్రి మద్యం సేవించేందుకు వెళ్లారు. పీకల దాకా మద్యం తగిన లాయిఫ్, అతని స్నేహితులకు మద్యం మత్తులో ఏదో విషయంలో మాట మాట పెరిగింది. ఈ క్రమంలోనే ముగ్గురు స్నేహితులు లారీ డ్రైవర్ లాయిఫ్ తలపై బీరు బాటిళ్లతో బాది, అనంతరం బీరు సీసాలతో గొంతుకోసి హత్య చేశారు. తరువాత అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana