మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీరు చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు. ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు రావలసిన పదవుల విషయంలో కొంత ఆలస్యం అవుతుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. మేష రాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం శివపంచాక్షరీ మంత్రంతో శివుణ్ణి అభిషేకించడం, పూజించడం మంచిది.