వీటో అధికారం ఉండదు
భద్రతామండలి సభ్య దేశాల్లో వీటో అధికారం ఐదు శాశ్వత సభ్యదేశాలకే ఉంటుంది. అవి అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. అల్జీరియా, గయానా, దక్షిణ కొరియా, సియెర్రా లియోన్, స్లోవేనియా దేశాలు గత సంవత్సరం తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికయ్యాయి. అంతర్జాతీయ శాంతి, భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత భద్రతా మండలిపై ఉంటుంది. కానీ, వీటో అధికారం ఉన్న సభ్య దేశాల కారణంగా ఈ విషయంలో భద్రతామండలి సమర్ధవంతంగా పని చేయలేకపోతోంది. ఇది రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, హమాస్ -ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో స్పష్టమైంది.