
- 164వ సారి రక్తదానం
జనవాహిని ప్రతినిధి తాండూరు:”రక్తదానం మహాదానం” అనే నినాదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, తాండూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్. తాజాగా ఆయన ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి అర్ధరాత్రి వేళ రక్తదానం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన సిరపురపు వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని స్టార్ హాస్పిటల్‌లో ఓపెన్ హార్ట్ సర్జరీ జరుగుతోంది. ఆ సమయంలో ఆయన పరిస్థితి విషమించడంతో అత్యవసరంగా ‘O- నెగటివ్’ రక్తం అవసరమైంది. ఈ అరుదైన గ్రూపు రక్తం కోసం ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా ప్రయత్నించగా,విషయం తెలుసుకున్న వెంటనే డాక్టర్ సంపత్ కుమార్ స్పందించారు. బుధవారం రాత్రి అయన స్వయంగా హాస్పిటల్‌కు చేరుకుని 164వ సారి రక్తదానం చేశారు. ఆయన సకాలంలో స్పందించి రక్తదానం చేయడంతో వెంకటేశ్వరరావు కు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది.తమ కుటుంబానికి అండగా నిలిచిన సంపత్ కుమార్ వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు తెలిపారు.



