ముంబైలో సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది.దాదర్, కుర్లా, ఘాట్‌కోపర్, ములుండ్, విఖ్రోలి, సహా దక్షిణ ముంబయిలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షంతోపాటు, బలమైన ఈదురు గాలులు వీచాయి. కొన్నిచోట్ల దట్టమైన దుమ్ము ఎగసిపడింది. ఘాట్‌కోపర్‌లోని సమతా నగర్‌లో గాలి తీవ్రతకు 100 అడుగుల ఎత్తైన ఇనుప హోర్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో 14 మంది దుర్మరణం చెందారు. 70 మంది గాయపడ్డారు. కూలిన హోర్డింగ్ కింద కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు తెలిసింది.