తిరుపతి జిల్లా చంద్రగిరిలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. నిన్న పద్మావతి వర్శిటి స్ట్రాంగ్ రూమ్ దగ్గర పులివర్తి నానిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా.. పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి నిరసనకు దిగారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి తమ వారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ సుధారెడ్డి ప్రశ్నించారు.