కోవిడ్ 19 కొత్త వేవ్
‘‘మేము కోవిడ్ 19 వేవ్ ప్రారంభంలో ఉన్నాము. ఇక్కడ ఇది క్రమంగా పెరుగుతోంది. వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో అంటే జూన్ మధ్య నుంచి చివరి వరకు కరోనా ఉధృతి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నాం’’ అని సింగపూర్ ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్ తెలిపారు. దేశంలో కోవిడ్ 19 ఇన్ఫెక్షన్స్ పెరుగుదలను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. కేసుల సంఖ్య భారీగా పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. రోగులను ఆసుపత్రుల్లో చేర్చాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే చికిత్స అందించే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. లక్షణాలు స్వల్పంగా ఉంటే లేదా వారికి ఇతర వైద్య సమస్యలు లేకపోతే వారికి ఇంట్లోనే చికిత్స అందిస్తామన్నారు. అర్హులైన పౌరులంతా మరో డోస్ కోవిడ్ వ్యాక్సీన్ తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం సింగపూర్ లో కేపీ.1, కేపీ.2 కొరోనా వేరియంట్ కేసులే మూడింట రెండొంతుల వరకు ఉన్నాయి. కేపీ.1, కేపీ.2 వేరియంట్లు ఇతర వేరియంట్ల కంటే ఎక్కువగా వ్యాప్తి చెందుతాయని లేదా మరింత తీవ్రమైన వ్యాధిని కలిగిస్తాయని ఇప్పటివరకు ఎటువంటి సూచనలు లేవు.