Sunday, October 27, 2024

Ruchaka raja yogam: అద్భుతమైన రాజయోగం ఇవ్వబోతున్న కుజుడు.. ఈ రాశుల జాతకులకు దశ తిరిగినట్టే

Ruchaka raja yogaవైదిక జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల అధిపతిగా అంగారకుడిని భావిస్తారు. ధైర్యం, శౌర్యం, శక్తి, ఆత్మవిశ్వాసానికి కారకంగా చెప్తారు. అంగారకుడి కదలికను మార్చడం వల్ల ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక అంశాల మీద ప్రభావాన్ని చూపుతుంది.

హిందూ క్యాలెండర్ ప్రకారం జూన్ 1వ తేదీ కుజుడు మీన రాశిని వీడి మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. జులై 12 వరకు కుజుడు ఈ రాశిలోనే సంచరిస్తాడు. అంగారకుడి సొంత రాశి ఇది. మేషం లేదా వృశ్చికంలో ఉన్నప్పుడు లేదా మకర రాశిలో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు కుజుడు అద్భుతమైన రుచక రాజయోగాన్ని సృష్టిస్తాడు.

రుచక రాజయోగం అంటే ఏంటి?

జ్యోతిష్య శాస్త్రంలో రుచక రాజయోగం అత్యంత శక్తివంతమైన పంచ మహా పురుష యోగాలలో ఒకటి. కుజుడు చతుర్భుజం లేదా కేంద్ర గృహాలలో ఒకటి, నాలుగు, ఏడు లేదా 10వ స్థానంలో కూర్చున్నప్పుడు రుచక రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఏర్పడాలంటే అంగారకుడు దాని పాలక రాశిలో ఉండాలి. ఈ కేంద్ర గృహాలలో మేషం, వృశ్చికం లేదా మకరం ఉన్నతమైన రాశిలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది.

జాతకంలో ఈ యోగం ఉంటే ఆ వ్యక్తి పేరు కీర్తి, సంపద, శక్తి, గౌరవప్రదమైన ప్రయోజనాలు పొందుతారు. వృత్తి జీవితంలో గొప్ప శక్తిని కలిగి ఉంటారు. ధైర్యసహసాలు పెరుగుతాయి. ఈ యోగం వల్ల ఒక వ్యక్తి ధైర్యవంతుడు, శక్తివంతుడు అవుతాడు. మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అపార విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులకు అధికార పార్టీ నుంచి మద్దతు లభిస్తుంది. మేష రాశిలో కుజుడి సంచారంతో ఏయే రాశులకి ఈ యోగం ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.

మేష రాశి

కుజుడి సంచారం మేష రాశి జాతకులకు చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం విస్తరిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ప్రతిపనిలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

సింహ రాశి

అంగారకుడు ఇచ్చే రుచక రాజయోగం వల్ల సింహ రాశి జాతకులు ఎంతో ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ప్రతి పనిలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. కెరీర్ లో విజయం మెట్లు ఎక్కుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా అప్రైజల్స్ లభిస్తాయి. పూర్వీకుల ఆస్తి నుంచి సంపద పెరుగుతుంది. మరి కొద్ది రోజుల్లో మీ ఉద్యోగ అన్వేషణ పూర్తి అవుతుంది.

ధనుస్సు రాశి

కుజ సంచారం వల్ల ధనుస్సు రాశి వారికి అదృష్టం మెరుస్తుంది. వృత్తి పురోగతికి సువర్ణ అవకాశాలు లభిస్తాయి. నూతన ఆదాయ మార్గాలు మీకు లభిస్తాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రతి పని ఆశించిన దాని కంటే మెరుగైన ఫలితాలు అందిస్తుంది. ఈ సమయంలో పాజిటివ్ గా ఆలోచిస్తారు. మీ దృష్టి అంత పని మీదే ఉంటుంది. ఆత్మవిశ్వాసం, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి.

మీన రాశి

కుజుడి సంచారం మీన రాశి వారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ధనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. పనికి సంబంధించి విదేశాలకు కూడా వెళ్లాల్సి వస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామి పూర్తి మద్దతు మీకు ఉంటుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana