Bengalore Rave Party: బెంగుళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీని కర్ణాటక పోలీసులు భగ్నం చేశారు. ఆదివారం రాత్రి మొదలైన పార్టీపై తెల్లవారుజామున బెంగుళూరు పోలీసులు దాడి చేయడం పార్టీ వ్యవహారం బయటపడింది
బెంగుళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీలో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కారును గుర్తించారు. పోలీసులు ఎమ్మెల్యే పాస్‌పోర్ట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్న ఫామ్ హౌస్‌లో ఆదివారం రాత్రి పార్టీని ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము వరకు డీజేలతోొ, రేవ్ పార్టీని ఏర్పాటు చేవారు. ఈ పార్టీలో ఏపీ, తెలంగాణలకు సినీతారలు, రాజకీయ ప్రముఖులు ఉన్నట్టు గుర్తించారు.
బెంగుళూరు రేవ్ పార్టీలో నెల్లూరు జిల్లాకు ప్రముఖ రాజకీయ నాయకుడికి చెందిన కారును గుర్తించారు. ఘటనా స్థలంలో సదరు నాయకుడికి చెందిన పాస్‌పోర్ట్ లభించినట్టు పోలీసులు చెబుతున్నారు.
ఏపీ 26సిఏ 777 వాహనాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో పాటు పలు టాప్ బ్రాండ్ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోపాలరెడ్డి అనే వ్యక్తికి చెందిన ఫామ్ హౌస్‌లో హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి పార్టీని ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. ఈ పార్టీలో దాదాపు 100మంది పాల్గొన్నారని, వారిలో కొందరు ఐటీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారని చెబుతున్నారు
రేవ్ పార్టీ ఏర్పాటు ద్వారా నిర్వహకులు ఒక్క రోజుకు రూ.30లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. పార్టీకి హాజరైన వారిలో ప్రముఖుల పిల్లలు ఉన్నట్టు సమాచారం. ఏపీ,తెలంగాణ నుంచి సినీ తారలను పార్టీకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. పోలీసుల దాడిలో కొకైన్, ఎన్డిఎంఏ డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఈ ఘటనపై ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దాదాపు 15కార్లను సీజ్ చేశారు.
తనకు సంబంధం లేదన్న కాకాణి…
బెంగుళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. కారుపై ఉన్న స్టిక్కర్ గడువు 2023తో ముగిసిందని స్పష్టం చేశారు. కారుపై స్టిక్కర్ ఎలా వచ్చిందో పోలీసుల దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. కారుపై ఉన్న స్టిక్కర్ ఒరిజినలా డూప్లికేటా అన్నది పోలీసులు తేల్చాల్సి ఉందన్నారు. బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో తనకు సంబంధం లేదని సినీ నటి హేమ స్పష్టం చేశారు. తాను ఎక్కడికి వెళ్లలేదని హైదరాబాద్‌లోనే ఫామ్ హౌస్‌లో ఉన్నానని చెప్పారు.
రేవ్ పార్టీ నిర్వహిస్తున్న వేదికపై బెంగుళూరు సీసీబీ పోలీసులు దాడి చేశారు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో ఈ దాడి జరిగింది. దాడి జరిగిన ఫామ్ హౌస్‌లో 17 MDMA మాత్రలు మరియు కొకైన్‌తో సహా డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు . 25 మందికి పైగా యువతులతో సహా ఆంధ్రప్రదేశ్ మరియు బెంగళూరు నుండి 100 మందికి పైగా ఈ ఈవెంట్‌కు హాజరైనట్టు పోలీసులు ధృవీకరించారు. పుట్టినరోజు పార్టీ పేరుతో ఈవెంట్ నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ సిటీలోని GR ఫామ్స్ హౌస్‌లో సోమవారం తెల్లవారుజామున 2గంటల వరకు ఈ పార్టీ సాగింది.
సీసీబీ యాంటీ నార్కోటిక్స్ విభాగం ఈ దాడులు నిర్వహించింది. ఫామ్‌హౌస్ కాన్ కార్డ్ యజమాని గోపాల రెడ్డికి చెందినదని, హైదరాబాద్‌కు చెందిన వాసు పార్టీని నిర్వహించారని పోలీసులు ఆరోపించారు. ఘటనా స్థలంలో బెంజ్ కారుపై ఆంధ్రా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన రెడ్డికి చెందిన శాసనసభ్యుని పాస్ ఉన్న వాహనం దొరికింది. మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్‌తో పాటు పదిహేను కంటే ఎక్కువ లగ్జరీ కార్లు ఆవరణలో ఉన్నాయి.
సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు జరిగే ఈ పార్టీ ఆదివారం సాయంత్రం 5 నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగింది. ఒక్క రోజు కోసం ముప్పై నుండి యాభై లక్షల వరకు ఖర్చు చేసినట్టు గుర్తించారు. పార్టీ కోసం DJలు, మోడల్‌లు, నటులు మరియు టెక్కీలు హాజరైన వారిలో ఉన్నారు, DJలు RABZ, KAYVEE మరియు BLOODY MASCARA పాల్గొన్నారు. పోలీసులు ప్రస్తుతం నార్కోటిక్ స్నిఫర్ డాగ్‌లతో వేదికపై దర్యాప్తు చేస్తున్నారు మరియు పార్టీలో పాల్గొన్న వ్యక్తులందరినీ గుర్తించే పనిలో ఉన్నారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.