Anuvanuvuu song lyrics: ఈ ఏడాది టాలీవుడ్ లో హారర్ కామెడీ థ్రిల్లర్ జానర్ లో వచ్చి సూపర్ హిట్ అయిన ఓం భీమ్ బుష్ మూవీలోని అణువణువూ సాంగ్ కూడా మంచి హిట్ అయింది. మంచి సాహిత్యం, మనసును ఆహ్లాదపరిచే లిరిక్స్, మెలోడీ కింగ్ అరిజిత్ సింగ్ వాయిస్.. ఇలా అన్నీ మెస్మరైజ్ చేస్తాయి. ఈ పాట లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాము. వీటిని చూస్తూ మీరు కూడా పాడేయండి.
అణువణువూ సాంగ్ లిరిక్స్
ఓం భీమ్ బుష్ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్ అయింది. అలాగే ఇలాంటి హారర్ కామెడీ థ్రిల్లర్ లో మనం ఊహించని ఓ మంచి మెలోడీ సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈ పాటకు సన్నీ ఎంఆర్ మ్యూజిక్ అందించగా.. బాలీవుడ్ ను కొన్నేళ్లుగా ఏలుతున్న సింగర్ అరిజిత్ సింగ్ పాడాడు. ఇక లిరిక్స్ ను కృష్ణకాంత్ అందించాడు. మరి ఆ లిరిక్స్ ఇక్కడ చూడండి.
అణువణువూ అలలెగసే..
తెలియని ఓ ఆనందమే
కనులెదుటే నిలిచెనుగా
మనసెతికే నా స్వప్నమే
కాలాలు కళ్లారా చూసేనులే
వసంతాలు వీచింది ఈ రోజుకే
భరించాను ఈ దూర
తీరాలు నీ కోసమే
అణువణువూ అలలెగసే
తెలియని ఓ ఆనందమే
కనులెదుటే నిలిచెనుగా
మనసెతికే నా స్వప్నమే
ఓ చోటే ఉన్నాను
వేచాను వేడానుగా కలవమని
నాలోనే ఉంచాను
ప్రేమంతా దాచనుగా పిలవమని
తారలైన తాకలేని
తాహతున్న ప్రేమని
కష్టమేది కానరాని
ఏది ఏమైనా ఉంటానని
కాలాలు కళ్లారా చూసేనులే
వసంతాలు వేచింది ఈ రోజుకే
భరించాను ఈ దూర
తీరాలు నీ కోసమే
కలిసెనుగా కలిపెనుగా
జన్మల బంధమే
కరిగెనుగా ముగిసెనుగా
ఇన్నాళ్ల వేదనే
మరిచా ఏనాడో
ఇంత సంతోషమే
తీరే ఇపుడే
పాత సందేహమే
నాలో లేదే మనసే
నీతో చేరే
మాటే ఆగి పోయే
పోయే పోయే
ఈ వేళనే
అణువణువూ అలలెగసే
తెలియని ఓ ఆనందమే
కనులెదుటే నిలిచెనుగా
మనసెతికే నా స్వప్నమే
ఓం భీమ్ బుష్ ఓటీటీ
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన ఓం భీమ్ బుష్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదనిపించింది. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే ట్యాగ్ లైన్ తో నిజంగానే అసలు లాజిక్స్ లేకుండా సాగిపోయే సినిమా ఇది. అయితే లాజిక్స్ తో పని లేకుండా కాసేపు నవ్వుకోవాలని అనుకుంటే ఈ సినిమా చూడొచ్చు.
సైంటిస్టులమని చెప్పుకొని ఓ ఊరికి వెళ్లి అక్కడి వాళ్లందరి సమస్యలు తీరుస్తామని చెప్పే ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథే ఈ ఓం భీమ్ బుష్. ఆ క్రమంలో వాళ్లు ఓ దెయ్యం బారిన ఎలా పడతారు? దాని నుంచి ఎలా బయటపడతారు అన్నది ఈ సినిమాలో చూడొచ్చు. హారర్ కామెడీ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వారు ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు.