Thursday, October 31, 2024

Devara Fear Song Lyrics: దేవర మూవీ ఫియర్ సాంగ్ లిరిక్స్ ఇవే.. అదరగొడుతున్న అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్

Devara Fear Song Lyrics: జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ప్రస్తుతం యూట్యూబ్ ను ఊపేస్తోంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ పాట తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తోంది.

నిజానికి ఈ పాటకు మిక్స్‌డ్ రియాక్షన్ వచ్చింది. హోరెత్తించే మ్యూజిక్ లో లిరిక్స్ సరిగా వినపడలేదన్న విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫియర్ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూడండి.

దేవర ఫియర్ సాంగ్ లిరిక్స్

దేవర మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ కు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించడమే కాకుండా పాట కూడా పాడాడు. ఇక ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి మ్యూజిక్ అందించాడు. జూనియర్ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కు తగినట్లుగా చాలా పవర్ ఫుల్ లిరిక్స్ తో ఈ పాట సాగిపోయింది. దేవర పాత్ర ఎంత బలమైనదో చెప్పే ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూసేయండి.

అగ్గంటుకుంది సంద్రం.. దేవ..

భగ్గున మండె ఆకసం

అరాచకాలు భగ్నం.. దేవ..

చల్లారె చెడు సాహసం

జగడపు దారిలో

ముందడుగైన సేనాని

జడుపును నేర్పగా

అదుపున ఆపే సైన్యాన్ని

దూకే ధైర్యమా జాగ్రత్త

రాకే తెగబడి రాకే

దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే

కాలం తడబడెనే

పొంగే కెరటములాగెనే

ప్రాణం పరుగులయీ..

కలుగుల్లో దూరేలే..

దూకే ధైర్యమ జాగ్రత్త..

పోవే.. పో ఎటుకైనా..

దేవర ముంగిట నీవెంత..

పోవెందుకే.. దేవర..

జగతికి చేటు చేయనేల

దేవర వేటుకందనేల

పదమే కదమై దిగితే ఫెళ ఫెళ

కనులకు కానరాని లీల

కడలికి కాపయ్యిందివేళ

విధికే ఎదురై వెళితే విల విలా

అలలయే ఎరుపు నీళ్లే..

ఆ కాళ్లను కడిగెరా

ప్రళయమై అతడి రాకే

దడ దడ దడ దండోరా

దేవర మౌనమే

సవరణ లేని హెచ్చరిక

రగిలిన కోపమే

మృత్యువుకైన ముచ్చెమట

దూకే ధైర్యమా జాగ్రత్త

రాకే తెగబడి రాకే

దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే

కాలం తడబడెనే

పొంగే కెరటములాగెనే

ప్రాణం పరుగులయీ

కలుగుల్లో దూరేలే..

దూకే ధైర్యమ జాగ్రత్త..

పోవే.. పో ఎటుకైనా..

దేవర ముంగిట నీవెంత..

పోవెందుకే.. దేవర..

లిరిక్స్‌పై విమర్శలు

ఇక దేవర ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ లిరిక్స్ పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కు తగినట్లుగా ఉన్నా కూడా.. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ కొంచెం అతిగా అనిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్నారు. దూకె ధైర్యమ జాగ్రత్త, మృత్యువుకే ముచ్చెమట లాంటి పదాలు అతిశయంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. మరికొందరైతే లిరిక్స్ అసలు సరిగా వినిపించడం లేదన్న ఫిర్యాదులు చేస్తున్నారు. హోరెత్తేలా అనిపిస్తున్న మ్యూజిక్ కూడా కొందరికి నచ్చలేదు.

దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ తోపాటు జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా ఇది. దీంతో కొరటాల శివ మరింత పవర్ ఫుల్ గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాడు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana