బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముంబైలో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత పౌరసత్వం పొందిన తర్వాత తొలి సారిగా ఓటు వేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 2023లో భారత పౌరసత్వం పొందిన అక్షయ్ కుమార్.. దేశం అభివృద్ధి చెందాలన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఓటేశానని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు వేయాలని అక్షయ్ కుమార్ కోరారు.