UPSC annual exam calendar: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక క్యాలెండర్ ను అధికారిక వెబ్సైట్ upsc.gov.in లో యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. ఈ యూపీఎస్సీ వార్షిక క్యాలెండర్లో 2025 సంవత్సరంలో యూపీఎస్సీ వివిధ విభాగాల్లో నిర్వహించే రిక్రూట్మెంట్ పరీక్షలు, ఆ పరీక్షల షెడ్యూల్స్ ను పేర్కొంది.
జనవరి 11న తొలి పరీక్ష
2025 లో యూపీఎస్సీ (UPSC) నిర్వహించే తొలి పరీక్ష జనవరి 11వ తేదీన ఉంది. జనవరి 11, 2025 నుంచి రెండు రోజుల పాటు యూపీఎస్సీ ఆర్టీ / ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఆ తరువాత కంబైన్డ్ జియో సైంటిస్ట్ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్, ఇంజనీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షను 2025 ఫిబ్రవరి 9న నిర్వహించనున్నారు. ఎన్ డీఏ, ఎన్ ఏ ఎగ్జామినేషన్ (ఐ) (N.D.A. & N.A. Examination (I)) 2025 తో పాటు, సీడీఎస్ ఎగ్జామినేషన్ (ఐ) (C.D.S. Examination (I), 2025) పరీక్షలను 2025 ఏప్రిల్ 13న నిర్వహించనున్నారు.
సివిల్స్ ప్రిలిమ్స్ మే 25న..
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష 2025, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్ 2025 మే 25, 2025 న జరుగుతాయి. 2025 లో జరిగే అన్ని పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేసే తేదీని, దరఖాస్తుల స్వీకరణ తేదీలను వార్షిక క్యాలెండర్ లో యూపీఎస్సీ పేర్కొంది.