Nabha Natesh About Accident: రామ్ పోతినేని-పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో సూపర్ హిట్ కొట్టిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న బ్యూటి నభా నటేష్. ఆ తర్వాత పలు సినిమాలు చేసిన అంతగా హిట్ కాలేదు. అయితే, నభా నటేష్‌కు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. దాంతో ఏడాదిన్నరపాటు సినిమాలకు దూరంగా ఉంది.
ఇటీవల ప్రియదర్శితో డార్లింగ్ మాటపై గొడవ చేసిన నభా నటేష్ అది సినిమా పబ్లిసిటీ స్టంట్‌లో భాగమని ఇటీవలే అర్థమైపోయింది. ప్రియదర్శి, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా డార్లింగ్. ఇటీవలే ఈ మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్ చేశారు. ఈ కార్యక్రమంలో డార్లింగ్ టైటిల్ గ్లింప్స్‌ను హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లాంచ్ చేయగా.. నటీనటులు తమ అభిప్రాయం పంచుకున్నారు.
ఈ క్రమంలోనే నభా నటేష్ కామెంట్స్ చేసింది. “యాక్సిడెంట్ వలన కొంత కాలం సినిమాలు చేయలేదు. మళ్లీ చేయడానికి ఒక ఎగ్జయిటింగ్ కథ కోసం ఎదురుచూస్తున్నపుడు అశ్విన్ ఈ కథ చెప్పారు. చాలా అద్భుతంగా అనిపించింది. అది విన్న నేను ఇన్నాళ్లు ఏమైపోయారు మీరు అనిపించింది” అని నభా నటేష్ సినిమా కథపట్ల తాను ఆశ్చర్యపోయినట్లు తెలిపింది.
“ఇందులో పాత్రలు చాలా కొత్తగా ఉంటాయి. ఇలాంటి భిన్నమైన కథని నమ్మి నిర్మించిన నిర్మాతలకు ధన్యవాదాలు. వివేక్ సాగర్ బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇది బెస్ట్ టీం వర్క్. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. దర్శి అద్భుతమైన నటుడు. చాలా సపోర్ట్ చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది” అని హీరోయిన్ నభా నటేష్ పేర్కొంది.
నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. “ఈ వేడుకకు విచ్చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ, ప్రశాంత్ వర్మ. హర్ష, సునీల్ గారి ధన్యవాదాలు. మా టీం అందరికీ థాంక్స్. దర్శకుడు అశ్విన్ నమ్మినది అద్భుతంగా తెరపై తీసుకొచ్చారు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులని అలరిస్తుందని నమ్ముతున్నాం” అని తెలిపారు.
“ప్రియదర్శి గారికి ఈ కథ చెప్పగానే తప్పకుండా చేద్దామని మాటిచ్చారు. మా కలలని నమ్మే వ్యక్తి కోసం ఎదురుచూశాం. నిర్మాత నిరంజన్ గారు మా కలల్ని సాకారం చేశారు. కథ చెప్పగానే నమ్మారు. శరవేగంగా సినిమాని చేశాం. ఆయన కంటెంట్‌ని బలంగా నమ్మారు” అని డార్లింగ్ డైరెక్టర్ అశ్విన్ రామ్ చెప్పారు.
“చైతన్య గారికి కూడా ఈ కథ చాలా నచ్చింది. చెప్పినపుడు చాలా ఎంజాయ్ చేశారు. ప్రియదర్శి, నభా, టీం అందరితో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం. టీం అందరికీ ధన్యవాదాలు” అని డైరెక్టర్ అశ్విన్ రామ్ అన్నారు. ఈ సినిమాతో తెలుగులో డెబ్యూ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు అశ్విన్ రామ్.
ఇదిలా ఉంటే, కర్ణాటక చిక్ మంగళూరుకు చెందిన నభా నటేష్ వజ్రకాయ అనే కన్నడ సినిమాతో 2015లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తర్వాత 2017లో లీ, సాహెబా వంటి కన్నడ మూవీస్ చేసింది. తెలుగులో నన్ను దోచుకుందువటే మూవీతో 2018లో హీరోయిన్‌గా డెబ్యూ ఇచ్చింది. ఆ తర్వాత అదుగో చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు.
అనంతరం 2019లో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది.