గత ఏడాది(2023)లో చూస్తే…మే 6వ తేదీన ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం… అప్పుడు ఏప్రిల్ 18వ తేదీతో పరీక్షలు పూర్తి అయ్యాయి. కానీ ఈసారి మాత్రం…. మార్చి 30వ తేదీతో ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. దీంతో గతంతో పోల్చితే ఈసారి ముందుగానే ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది రెగ్యూలర్ అభ్యర్థులు 6,23,092 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో బాలుర సంఖ్య 3,17,939గా ఉంటే బాలికల సంఖ్య 3,05,153గా ఉంది.