ఈ సినిమా టీజర్ విడుదల సందర్భంగా చిరు లీక్స్‌పై, సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. “యూవీ కాన్సెప్ట్స్‌లో విక్కీ నిర్మాతగా, దర్శకుడు ప్రశాంత్ రెడ్డి చంద్రపు రూపొందిస్తున్న భజే వాయు వేగం సినిమా టీజర్, టైటిల్ ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. నా అభిమాని, తమ్ముడు లాంటి కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. నా అభిమాని హీరోగా ఓ మంచి సినిమాలో నటిస్తున్నాడంటే ఆ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను” అని చిరంజీవి అన్నారు.