ఐ మూవీతో…
తమిళ మూవీ మదరాసిపట్టణంతో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది అమీజాక్సన్. విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ మూవీతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు చేరువైంది. టాలీవుడ్లో రామ్‌చరణ్‌తో ఏవడు సినిమాలు చేసింది. అందాల ప్రదర్శన విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకొని ఈ సుందరికి తమిళంతో పాటు హిందీలో చక్కటి అవకాశాలు వచ్చాయి. కానీ ఈ బోల్డ్ బ్యూటీ నటించిన సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలవడంతో అమీజాక్సన్ ఐరెన్ లెగ్గా ముద్రపడింది. సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఆమెకు పెద్దగా కలిసిరాలేదు.ఈ ఏడాది నెల రోజుల గ్యాప్‌లోనే వచ్చిన మిషన్ ఛాప్టవర్ వన్, క్రాక్ బాక్పాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.