Friday, November 1, 2024

కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు | ec notice to telangana former cm| kcr| code

posted on Apr 17, 2024 11:36AM

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 5న సిరిసిల్లలో కేసీఆర్ ప్రసంగంలో చేసిన అభ్యంతర కర వ్యాఖ్యలపై బుధవారం ( ఏప్రిల్ 18) లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. ఆయన ప్రసంగంలో చేసిన పరుష వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తాయని ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ కార్యదర్శి అవినాష్ కుమార్ జారీ చేసిన ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఫిర్యాదు మేరకు ఈ ఎన్నికల సంఘం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. 

లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏప్రిల్ 5న సిరిసిల్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరుష పదాలతో చేసిన కామెంట్లను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆయనకు మంగళవారం నోటీసులు జారీచేసింది. పార్టీ అధినేతగా, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, అందుకు తగిన ప్రాథమిక ఆధారాలను కమిషన్ పరిశీలించిందని ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసుకు గురువారం (ఏప్రిల్ 18) ఉదయం 11 గంటలకల్లా కమిషన్‌కు చేరేలా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి వాస్తవాలతో కూడిన రిపోర్టును తెప్పించుకున్న తర్వాత ఈ నోటీసు జారీ చేయాల్సి వచ్చిందని అవినాశ్ కుమార్ పేర్కొన్నారు.

సిరిసిల్లలో తన ప్రసంగంలో కేసీఆర్ ప్రతిపక్ష నేతలపై కుక్కల కొడుకుల్లారా, లతుకోరులు, చవటదద్దమ్మలు వంటి పరుష పదాలను ప్రయోగించారు. అలాగే లతుకోరు ప్రభుత్వం, గొతుల్ని కోసేస్తాం, చంపేస్తాం వంటి  వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తాయంటూ ఎన్నికల సంఘం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది.  

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana