Friday, November 1, 2024

మాట త‌ప్ప‌టం జ‌గ‌న్ నైజం.. చెప్పింది చేయ‌టం చంద్ర‌బాబు ల‌క్ష‌ణం.. కేశినేని వెంక‌ట్ | Jagan nature to slur words| cbn charector| ston

posted on Apr 16, 2024 5:56PM

543వ డివిజ‌న్ లో ఇంటింటికి ఎన్నిక‌ల ప్ర‌చారం 

క‌మ‌లం గుర్తు, సైకిల్ గుర్తు పై ఓటు వేయాల‌ని అభ్య‌ర్ధ‌న 

కేశినేని వెంక‌ట్, యలమంచిలి కార్తీక్ కి అపూర్వ స్వాగ‌తం

వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏమి లేదు. రాష్ట్రాన్ని తాక‌ట్టు పెట్టి అప్పుల‌పాలు చేసి ప్ర‌జ‌ల నెత్తిమీద భారం మోపాడు. ఈ ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ చేసిన ప‌ని ఒక్క‌టే..ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట నెరవేర్చ‌కుండా మాట త‌ప్ప‌టం..మాట త‌ప్పే నైజం గ‌ల జ‌గ‌న్..ఇదొక్క‌టి మాత్ర‌మే ఖ‌చ్చితంగా చేశాడ‌ని టిడిపి యువ‌నాయ‌కుడు  కేశినేని వెంక‌ట్ అన్నారు. విజ‌య‌వాడ పార్ల‌మెంట్ అభ్య‌ర్ధి కేశినేని శివ‌నాథ్ గారి త‌న‌య‌డు వెంక‌ట్, బిజెపి ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి సుజాన చౌద‌రి గారి త‌న‌యుడు య‌ల‌మంచిలి కార్తీక్ క‌లిసి ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో మంగ‌ళ‌వారం ఉద‌యం 53వ డివిజ‌న్ లో ఇంటింటికి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. జెండా సెంట‌ర్ నుండి మొద‌లైన ఈ ప్ర‌చారం ఆ ప్రాంతంలోని ప‌లు వీధుల్లో ఎన్డీయే కూట‌మి కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య భారీగా సాగింది.

ఈ ఎన్నిక‌ల ప్ర‌చారానికి ప్ర‌జ‌ల నుంచి అపూర్వ స్పంద‌న ల‌భించింది. ఈ ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కేశినేని వెంక‌ట్ అధికారంలోకి రాగానే ఎన్డీయే ప్ర‌భుత్వంలో ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు చేయ‌బోయే అభివృద్ది ప‌నుల గురించి చెప్పారు. విజ‌న్ గ‌ల నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు అయితే…ఎటువంటి ప్ర‌ణాళిక‌లు, అభివృద్ది ఆలోచ‌న‌లు లేని నాయ‌కుడు జ‌గ‌న్ అని వివ‌రించారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేయ‌టంలో…ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందించ‌టంలో చంద్ర‌బాబు గారు చెప్పిందే కాదు..,చెప్ప‌న‌వి కూడా చేస్తార‌న్నారు.

ఎన్డీయే అభ్య‌ర్ధుల్ని గెలిపించేందుకు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో అసెంబ్లీ ఓటు క‌మ‌లం గుర్తుపై , పార్ల‌మెంట్ ఓటు సైకిల్ గుర్తు పై వేయాల‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో డివిజ‌న్ ప్రెసిడెంట్ రావూరి స‌త్య‌నారాయ‌ణ‌, నియోజ‌క‌వ‌ర్గ మైనార్టీ కార్య‌ద‌ర్శి ఇమ్రాన్, తెలుగు మ‌హిళ నాయ‌కురాలు ల‌క్ష్మీ, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ మ‌ధుతో టిడిపి, బిజెపి, జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్తలు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana