posted on Apr 15, 2024 1:06PM
జగన్న మీద హత్యాయత్నం జరిగింది, ఎయిర్‌గన్‌తో గులకరాయితో షూట్ చేశారు అని వైసీపీ వర్గాలు నానా రచ్చ చేస్తున్నాయి. కోడికత్తి-2 డ్రామాని రక్తి కట్టించడానికి నానా తంటాలు పడుతున్నాయి. అయితే ప్రజలు వైసీపీ అండ్ కంపెనీని నమ్మడం లేదు. ఎన్నికల సమయంలో ఇలాంటి డ్రామాలు ఆడటం వీళ్ళకు అలవాటు అయిపోయిందని విసుక్కుంటున్నారు. పరిస్థితి ఎలా తయారైందంటే, నిజంగానే ఎవరైనా ఆకతాయి రాయి విసిరాడని విచారణలో తేలినా జనం నమ్మేట్టు లేరు. ఇదంతా వైసీపీ డ్రామానే అని జనం ఫిక్సయిపోయారు. ఇదిలా వుంటే, ఈ విషయం మీద జనంలో కూడా భారీ స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొత్త వాదన బయటకి వచ్చింది. జగన్ కంటి పైన రెండు కుట్లు పడేంత గాయం కనిపిస్తోందిగానీ, ఒక్క రక్తపు చుక్క కూడా కారడం కనిపించలేదు. జగన్ కంటి పైన వున్నది నిజం గాయం కాదని, అది మేకప్ అనే అనుమానాలు జనం వ్యక్తం చేస్తున్నారు. చిన్న సూదితో గుచ్చితేనే రక్తం కారిపోతుందే, అలాంటిది రెండు కుట్లు వేసేంత గాయం తగిలినా చుక్క రక్తం కూడా కారకపోవడమేంటనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కోడికత్తి డ్రామా సందర్భంలో కూడా జగనన్న చొక్కా మీద ఒక రక్తపు చుక్క కనిపించింది తప్ప, అసలు ఆ గాయం ఎంత అయిందనేది హైదరాబాద్ డాక్టర్లకు మినహా మరెవరికీ తెలియదు. ఇప్పుడు ఈ విషయం మీద దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు జగన్ గాయాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం వుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కోడికత్తి-2 డ్రామా సందర్భంగా జగన్‌కి ట్రీట్‌మెంట్ జరిగిన విధానం పెద్ద కామెడీ ఇష్యూగా మారింది. తగిలింది చిటికెడు గాయం. దానికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినంత రేంజ్‌లో బోలెడంతమంది డాక్టర్లు అటెండ్ కావడం.. వాళ్ళందరూ జగన్‌తో ఫొటోలు దిగడం.. ఇదంతా చూసి జనం నవ్వుకుంటున్నారు.