ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము కూలగొట్టమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డికి ఆ పార్టీలోనే సరైన మద్దతు లేదన్నారు. ఎంఐఎంతో దోస్తీపై హస్తం పార్టీ నాయకులే మాట్లాడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత వారికి ముచ్చెమటలు పట్టిస్తోందన్నారు.