పాము ఇంటికి వస్తే భయపడతాం. కొందరైతే పాము ఇంటి దగ్గరికి రాగానే చంపేస్తారు. అలా చేయకండి, బదులుగా పాములు పట్టేవారిని పిలిపించండి. పామును పట్టుకుని అడవిలో వదిలేస్తారు. ఏ పామును చంపవద్దు. ఇది విష జంతువు, కానీ కాటు వేయదు. దానికి ఏదైనా ఇబ్బంది కలిగిస్తేనే కాటు వేస్తుంది. పామును పట్టుకున్న తర్వాత దాని తోక పట్టుకుని ఫోటోలు, వీడియోలు తీయవద్దు. దానిని భద్రంగా బ్యాగ్లో పెట్టి వదిలివేయండి.