సిద్దు జొన్నలగడ్డ.. టిల్లు మార్క్ డైలాగ్స్, యాక్టింగ్, మేనరిజమ్స్ టిల్లు స్క్వేర్ మూవీ పూర్తిగా వర్కౌట్ అయ్యాయి. దీంతో డీజే టిల్లుకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం క్రేజ్‌ను నిలుపుకొని.. అంతకు మించి వసూళ్లను రాబడుతోంది. అనుపమ పరమేశ్వన్ గ్లామర్ కూడా ఈ చిత్రానికి మరో పెద్ద ప్లస్ అయింది. టిల్లు స్క్వైర్ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూజ్ చేశారు. రామ్ మిర్యాల, అచ్చు రాజమణి, భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు.