7-year-old girl gang raped: బిహార్ లోని పూర్ణియా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రూపౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో నివాసం ఉండే ఒక ఏడేళ్ల బాలిక అదృశ్యమైన మరుసటి రోజే మొక్కజొన్న చేనులో సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైంది. ప్రాథమికంగా ఇది అత్యాచారం, హత్య కేసుగా కనిపిస్తోందని, అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఇది నిర్ధారణ అవుతుందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) అంజాద్ అలీ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.