Thursday, January 16, 2025

Sunitha On YS Avinash Reddy : అవినాష్ లాంటి హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదు, సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హంతకులు దర్జాగా తిరుగుతుంటే

వివేకాను అతి దారుణంగా హత్య చేసిన వాళ్లు దర్జాగా బయట తిరుగుతుంటే ఇన్ని వ్యవస్థలు ఏం చేయలేకపోతున్నాయని సునీతా రెడ్డి(Sunitha Reddy) ఆవేదన చెందారు. హంతకులు అధికారంలో ఉంటే తనకు ఎప్పటికీ న్యాయం జరగదన్నారు. గత ఐదేళ్లుగా వివేకా హత్య కేసు(Viveka Murder case)లో న్యాయం కోసం పోరాడుతున్నాయని, ఎన్నో కష్టాలు చూశానన్నారు. తనకు ఇంత చదువు, తెలివి, స్థోమత ఉన్నా ఏం చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నానన్నారు. ఈ ఎన్నికల్లో అవినాష్‌ రెడ్డిని(YS Avinash Reddy) గెలవకుండా చేయడమే తన లక్ష్యమని చెప్పారు. వైఎస్‌ఆర్‌ మరణించినప్పుడు జగన్‌(YS Jagan) ఎంపీగా ఉన్నారని, పులివెందులలో ఎవరు పోటీ చేయాలనే విషయంపై చర్చ జరిగిందన్నారు. అయితే వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి పేరు చర్చలో ముందుకు వచ్చిందని, కానీ ఆయన పోటీ చేయడాన్ని వివేకా అంగీకరించలేదన్నారు. వైఎస్ షర్మిల లేదా విజయమ్మను బరిలో దించాలని సూచించారన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ వివేకానందరెడ్డికి మంత్రి పదవి ఇచ్చిందని, కానీ దీనిని జగన్‌ వ్యతిరేకించారన్నారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో జగన్‌, విజయమ్మ కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం, 2011 ఉపఎన్నికలో జగన్‌, విజయమ్మ(Vijayamma) తిరిగి పోటీ చేశారన్నారు. ఆ తర్వాత వివేకా కాంగ్రెస్ కు రాజీనామా చేసి జగన్‌తో ఉండాలని వైసీపీలో చేరారన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana