Grapes in Pregnancy: గర్భం ధరించాక తినే ప్రతి ఆహారం పైన దృష్టి పెట్టాలి. తల్లికీ బిడ్డకూ మేలు చేసే ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా అన్ని రకాల పండ్లను తినమని చెబుతారు పోషకాహార నిపుణులు. అయితే గర్భం ధరించాక ద్రాక్ష పండ్లను దూరంగా పెట్టమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ద్రాక్ష పండ్లు నోరూరించేలా ఉంటాయి. తీపిగా, జ్యూసీగా ఉంటాయి. ఎక్కువ మంది గర్భిణిలు వీటిని తినేందుకు ఇష్టపడతారు. నిజానికి గర్భిణీలు ద్రాక్ష పండ్లను తినకపోవడమే మంచిది. సాధారణ వ్యక్తులు ద్రాక్ష పండ్లను తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు. వీటిలో విటమిన్ సి, విటమిన్ కే, పొటాషియం, ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి పెంచడానికి కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవడానికి ఉపయోగపడతాయి ఈ పండ్లు ఉపయోగపడతాయి. అయితే గర్భిణీ స్త్రీలు మాత్రం ద్రాక్ష పండ్లకు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఇది ఎదుగుతున్న పిండంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.