వైఎస్ షర్మిల తరపున వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతా రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డికి ఓటు వేయవద్దని బహిరంగంగానే చెప్పారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు. షర్మిలను ఎంపీగా పోటీ చేయించాలనేది వివేకా ఆలోచన అని ఆమె గుర్తు చేసుకున్నారు.