Sunday, January 12, 2025

CTET 2024 : సీటెట్ అభ్యర్థులకు అలర్ట్, దరఖాస్తు గడువు పొడిగింపు

సీటెట్ పరీక్ష విధానం(CET Exam)

సీటెట్ రిజిస్ట్రేషన్(CET Registration) కోసం జనరల్‌, ఓబీసీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.1000, రెండు పేపర్లకు రూ.1200 రుసుము చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగులు ఒక పేపర్‌కు రూ.500, రెండు పేపర్లకు రూ.600 రుసుము చెల్లించాలి. సీటెట్ స్కోరును(CTET Score) కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలకు జరిగి ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. సీటెట్‌ స్కోరుకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. సీటెట్ ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. ఒకటి నుంచి 5వ తరగతులకు బోధించాలనుకునే వారు పేపర్-1, 6 నుంచి 9వ తరగతుల వరకు బోధించాలనుకునే అభ్యర్థులు పేపర్-2ను రాయవచ్చు. సీటెట్ లో ప్రశ్నలన్నీ మల్టిపుల్ ఛాయిస్ రూపంలోనే ఉంటాయి. నాలుగు ఆప్షన్స్​లో ఒకటి ఎంపిక చేసి, ఓఎంఆర్​లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. పేపర్-2 ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. పేపర్‌-1 పరీక్షను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు నిర్వహిస్తారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana