ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను అధిష్ఠానం ప్రకటించింది. మెుదటి జాబితాలో 114 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లతో లిస్ట్ విడుదల చేసింది. అదే విధంగా 5 లోక్‌సభ స్థానాల అభ్యర్థులనూ వెల్లడించింది. కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల రెడ్డి పోటీ చేయనున్నారు. కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్దరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూల్ నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ పోటీలో ఉండనున్నారు.