అవును తప్పంతా నాదే ఎవరు ఒక్క మాట అన్నా పడరు. మీరు నా మీద అరుస్తారు. నేనే పిచ్చిదానిలా అందరికీ సమాధానం చెప్పుకోవాలని దీప గుండెలు పగిలేలా ఏడుస్తుంది. నువ్వే మాకు పట్టిన దరిద్రం, నువ్వు వచ్చిన దగ్గర నుంచి మా బతుకులు ఇలా అయ్యాయి. నువ్వు రాకపోయి ఉంటే మా తమ్ముడు ఇంకొక పేలి చేసుకుని ఉండేవాడు నా బతుకు ఇలా అయ్యేది కాదు. ఈ దరిద్రాలకు కారణం నువ్వే. ఎవరు కని పారేశారో ఏంటోనని అనసూయ దీపని చూస్తూ తిట్టుకుంటుంది. ఊరు వెళ్తున్నావ్ అక్కడే ఉండిపోకుండా త్వరగా తిరిగి వచ్చేయ్. నువ్వు వస్తే నా కొడుకుతో రావాలి లేదంటే డబ్బుతో తిరిగి రావాలి. వస్తే అప్పుల వాళ్ళు ఊరుకోరు. ఈ ఇల్లు మాత్రం పోవడానికి వీల్లేదని అనసూయ ఖరాఖండిగా చెప్తుంది.