నీ రక్తం చిందించావా
మనోహరి మాట్లాడుతున్నా వినకుండా ప్రిన్సిపాల్ వెళ్లిపోతుంది. పిల్లలు సంతోషంతో గంతులు వేస్తారు. మిస్సమ్మ, రాథోడ్ రామ్మూర్తి దగ్గరకు వస్తారు. పిల్లలకోసం దెబ్బ తగిలించుకున్నావా మిస్సమ్మ అంటాడు రాథోడ్. ఆ ఇంటి కన్నీళ్లు తుడవడం కోసం నీ రక్తం చిందించావా అంటాడు రామ్మూర్తి. ఆ మనోహరిని ఆపడం కోసం ఏమైనా చేస్తాను అనుకున్నా గానీ, పిల్లల కోసం ఇలా చేస్తానని అనుకోలేదు నాన్న అంటుంది భాగమతి.