Thursday, November 7, 2024

రేపు కెసీఆర్ మూడు జిల్లాల పర్యటన 

posted on Mar 30, 2024 10:55AM

గత ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన బిఆర్ఎస్ అధినేత కేసీఆర్  నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టారు. బిఆర్ఎస్ నుంచి ఎక్కువమంది ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం బిఆర్ ఎస్ ను కలవరపెడుతోంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం (మార్చి 31) పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. నీరు లేక ఎండిపోతున్న పొలాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం, బాధిత రైతులతో సమావేశమవుతారు. జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.  సాగునీరు అందక పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నూరిపోసేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం  ఆయన నేరుగా రైతుల వద్దకు వెళ్లి, మీకు మేము అండగా ఉంటామన్న భరోసా కల్పించనున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, సభలు, సమావేశాలతో బిజీగా ఉంటే, కేసీఆర్‌ మాత్రం రైతులకు మనోధైర్యం కల్పించేందుకు  ప్రాధాన్యం ఇస్తున్నారు. తమకు ఎన్నికల కన్నా రైతుల కన్నీళ్లు తుడవటమే అత్యంత ముఖ్యమని బీఆర్‌ఎస్‌ కార్యాచరణ నిరూపిస్తున్నదని ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. పదేళ్ల బిఆర్ఎస్  హాయంలో చిక్కిశల్యమైపోయిన వ్యవసాయాన్ని  కఠోర శ్రమతో దరికి చేర్చి బాధ్యతాయుతమైన పార్టీగా, ఆ పార్టీకి సారధ్యం వహిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  రైతులకు ధైర్యాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారని అందుకే జిల్లాల పర్యటన తలపెట్టారని కాంగ్రెస్  నేతలు చెప్తున్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాటను కాంగ్రెస్‌ పార్టీ  చెబుతోంది.  రాష్ట్ర రైతాంగం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, ఈ తరుణంలో రైతులకు బాసటగా నిలవాలని తెలంగాణ కాంగ్రెస్  నిర్ణయించింది. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని నమ్మించిన కాంగ్రెస్‌, అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా హామీలను అమలు చేయకపోగా మరింత కుంగదీసే చర్యలకు పాల్పడుతున్నదని బీఆర్‌ఎస్‌ విమర్శిస్తున్నది. రైతులకు అండగా నిలిచేందుకు ఆదివారం నుంచి కేసీఆర్‌ జిల్లాల్లో పర్యటిస్తారని పార్టీ స్పష్టం చేసింది. ఇప్పటికే రైతుల కోసం అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడంతోపాటు రైతులను ఆదుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పొలాల పరిస్థితిని పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు రాష్ట్రంలో చూస్తున్న నీటి కొరతకు ప్రకృతి కారణం కాదని, పాలక పక్షమే కారణమని మండిపడ్డారు. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana