టీవీ షోల్లో రష్మి అదరగొడుతున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన ఆమె.. మరిన్ని కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తున్నారు. అడపాదడపా సినిమాల్లోనూ కనిపిస్తున్నారు. మెగాస్టార్ హీరోగా నటించిన భోళా శంకర్ చిత్రంలో గతేడాది రష్మి నటించారు. హాస్టల్ బాయ్స్ మూవీలోనూ క్యామియో రోల్లో కనిపించారు. సోషల్ మీడియాలో తరచూ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటారు ఈ గ్లామరస్ యాంకర్. అయితే, కొన్నిసార్లు ట్రోలింగ్‌కు కూడా గురవుతుంటారు. అయినా, తన అభిప్రాయాలను గట్టిగా చెబుతుంటారు రష్మి.