Unsplash
Hindustan Times
Telugu
తమలపాకు నీరు ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. తమలపాకులను నీళ్లలో మరిగించి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Unsplash
తమలపాకు నీరు జలుబు, దగ్గుకు మంచిది. ఇది కఫా, పిత్త దోషాలను తగ్గిస్తుంది.
Unsplash
3-4 తమలపాకులను కడిగి మూడు గ్లాసుల నీటిలో బాగా మరిగించి, ఒక గ్లాసు మిగిలి ఉన్నప్పుడు, అది చల్లారిన తర్వాత రోజుకు రెండు మూడు సార్లు తాగాలి.
Unsplash
ప్రస్తుతం చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. తమలపాకు నీళ్ళు తాగడం వల్ల మలబద్ధకం నుంచి బయటపడవచ్చు.
Unsplash
వాంతులు, విరేచనాలు, వికారం వంటి సమస్యలు ఉంటే తమలపాకు నీరు కూడా మేలు చేస్తుంది. ఈ నీరు మన జీర్ణ శక్తిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.
Unsplash
తమలపాకులతో చేసిన నీరు నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. అంతేకాదు దంతాలను పాలిష్ చేయడంలో సహాయపడుతుంది.
Unsplash
తమలపాకుల నీటిని రోజు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
Unsplash
వ్యాయామాలు చేయలేకపోతున్నారాయ ఇలా చేస్తే వేగంగా వెయిట్ లాస్!
Pexels